Chandrababu: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు న్యాయస్థానం.. అనారోగ్య కారణాల రీత్యానవంబర్ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు అంటే 24వ తేదీ వరకు వాయిదా వేసింది.. ఇక, మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. సాయంత్రం 4 గంటల తర్వాతే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని రాజమండ్రి జైలు అధికారులు చెబుతున్నారు. బెయిల్ కాపీ తీసుకుని జైలుకి వెళ్లనున్నారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు..
Read Also: Diwali: దీపావళికి మీ కంపెనీ గిఫ్ట్ ఇస్తుందా.. జాగ్రత్త దానికి కూడా టాక్స్ కట్టాల్సిందే
అయితే, బెయిల్ పేపర్లు అందిన తర్వాత ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి తర్వాత జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వనున్నారు జైలు అధికారులు.. జైలు దగ్గరికి జిల్లా పోలీసులతో పాటు ఎన్ ఎస్ జీ బృందం రానున్నాయి.. ఇప్పటికే రాజమండ్రిలోనే చంద్రబాబు ఎన్ ఎస్ జీ ఉంది.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రాబాబు బయటకు వచ్చిన తర్వాత.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం వరకు ర్యాలీగా వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్నమాట.. ఇక, ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు చంద్రబాబు.. హైదరాబాద్‌లోని ఎన్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి చికిత్స చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా హైకోర్టు కొన్ని షరతులను విధించిన విషయం విదితమే.. అయతే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణుల.. త్వరలోనే ఆయనకు పూర్తిస్థాయిలో బెయిల్ కూడా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.