Diwali: దీపావళి పండుగకు ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది ఆనందం, వెలుగుల పండుగ మాత్రమే కాదు.. బహుమతులు, బోనస్‌ల పండుగ కూడా. అందుకే ఈ సందర్భంగా అందరూ ఒకరికొకరు బహుమతులు అందజేసుకుంటారు. ఈ సందర్భంగా కంపెనీలు తమ ఉద్యోగులకు బహుమతులు కూడా ఇస్తాయి. అయితే బహుమతిగా స్వీకరించిన వస్తువులు లేదా డబ్బు భారతదేశంలో పన్ను విధించబడుతుందని మీకు తెలుసా? ఆదాయపు పన్ను ప్రకారం ఏయే బహుమతులపై ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకుందాం.
Read Also:AFG vs SL: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ విజయం.. స్టూడియోలో చిందులేసిన భారత మాజీలు!
గిఫ్ట్ టాక్స్ నియమాలు ఏంటి?
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 వరకు బహుమతులు పన్ను నుండి మినహాయించబడ్డాయి. గిఫ్ట్ మొత్తం రూ. 50 వేలు దాటితే అది పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే, మీరు ఏడాదిలో రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందుకున్నట్లయితే ఆదాయపు పన్ను చెల్లించాలి. అదే ఆర్థిక సంవత్సరంలో మీరు రూ. 25,000, రూ. 28,000 విలువైన బహుమతులు అందుకున్నట్లయితే, మొత్తం రూ. 53,000 అవుతుంది. ఇది మీ ఆదాయానికి జోడించబడుతుంది. పన్ను స్లాబ్ ప్రకారం టాక్స్ విధించబడుతుంది.
Read Also:Chandrababu Gets Bail: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
పన్ను ఎప్పుడు ఉండదు?
రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన బహుమతులు వస్తే ‘ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం’గా పరిగణిస్తారు. ఈ మొత్తం రూ.25,000, రూ. 18,000 అయితే, మొత్తం సంవత్సరానికి వచ్చిన బహుమతుల మొత్తం విలువ రూ.43,000. అప్పుడు మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బహుమతులపై పన్ను బాధ్యత కూడా బహుమతిని ఎవరు ఇస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు బంధువుల నుండి బహుమతిని అందుకున్నట్లయితే మొత్తం రూ. 50 వేలు దాటినా పన్ను ఉండదు. బంధువులలో జీవిత భాగస్వామి, సోదరుడు లేదా సోదరి, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి తల్లిదండ్రులు, ఇతరులు ఉంటారు.