Redmi 14C: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ (Xiaomi) సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇకపోతే, అతి త్వరలో భారతదేశంలో రెడీమి 14C 5G పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 50MP కెమెరా, 5,160mAh, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీని ధర, స్పెసిఫికేషన్‌లుఎం, కెమెరా మొదలైన వాటి గురించి మాకు వివరంగా చూద్దాం.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్?
రెడీమి 14C 5G ప్రారంభ ధర రూ.9,999 మాత్రమే. ఇది మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. 4GB + 64GB, 4GB + 128GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. రెడీమి 14C స్మార్ట్‌ఫోన్ రెడీమి 13C అప్‌గ్రేడ్ వేరియంట్. రెడీమి 14C 5G 6.88 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్లతో వస్తుంది. ఇది TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, 600 Nits గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. రెడీమి 14C 5G ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ తో వస్తుంది. ఇక ఇందులో సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Xiaomi HyperOSలో పనిచేస్తుంది.
Also Read: HMPV Virus: భారత్లో విజృంభిస్తున్న HMPV వైరస్.. గుజరాత్‌లో మరో కేసు..
ఇక ఈ ఫోన్ ధరల విషయానికి వస్తే.. 4GB + 64GB వేరియంట్ ధర రూ.9,999, 4GB + 128GB వేరియంట్ ధర రూ.10,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఈ మొబైల్ మొదటి సేల్ జనవరి 10 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. Redmi 14C 5G ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50MP. ఇందులో 2MP సెకండరీ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే ఈ మొబైల్ 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అయితే, బాక్స్‌లో 33W ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ IP52 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంటుంది. మొత్తానికి Redmi 14C 5G ఫీచర్లు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండటంతో, ఇది వినియోగదారులకు చక్కని ఎంపికగా నిలవనుంది. మంచి కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్, స్మూత్ డిస్ప్లేతో పాటు నూతన చిప్‌సెట్ ఈ ఫోన్ ఆకర్షణను మరింత పెంచాయి. మీరు చవకైన ధరలో మంచి ఫీచర్ల ఫోన్ కోసం చూస్తుంటే, రెడీమి 14C 5G మీకు సరైన ఎంపికగా ఉండొచ్చు.