Kannappa : చిత్ర పరిశ్రమలోని నటీనటుల అందరికీ డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే, కొంతమందికి మాత్రమే ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేసే అవకాశం లభిస్తుంది. కొందరు ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేయకుండానే తమ కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది. మంచు విష్ణు కొన్నేళ్లుగా కన్నప్ప సినిమా చేయాలని కలలు కన్నాడు. చాలా సంవత్సరాలుగా ఆయన వివిధ దర్శకులు, రచయితలతో చర్చలు జరుపుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చాలా సంవత్సరాలుగా రాలేదు. చివరగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్, అనేక మంది ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రలు, అతిథి పాత్రల్లో నటించనున్నారు.
Read Also:Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్?
‘కన్నప్ప’ సినిమాలో కిరాత పాత్రలో కనిపించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ లుక్ ఈ మధ్యనే మేకర్స్ రివీల్ చేశారు.. ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఆ తర్వాత, హీరోయిన్ పాత్రను రివీల్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వారం లేదా రెండు వారాల గ్యాప్‌లో ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ పాత్రలను రివీల్ చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా కాజల్ అగర్వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ పార్వతి దేవి పాత్రను పోషించింది. తెల్లటి చీరలో నవ్వుతూ ఆశీర్వదిస్తూ కనిపించే కాజల్ పార్వతి దేవి లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
Read Also:Tollywood Movies : కర్ణాటకలో తెలుగు చిత్రాలకు ఘోర అవమానం.. ఇది అస్సలు సహించేంది లేదు
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కాస్త వెనుక పడింది. దాదాపు 20ఏళ్ల పాటు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో సినిమాలు చేసిన ఆమె సీనియర్, జూనియర్, స్టార్, సూపర్ స్టార్, కొత్త హీరోలు ఇలా అందరితోనూ సినిమాలు చేసింది. కాజల్ అగర్వాల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పెళ్లి అయ్యి తల్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ మునుపటి మాదిరిగా సినిమాలు చేయాలని భావించినా అలా సాధ్య పడడం లేదు. దీంతో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తుంది. గెస్ట్ అప్పియరెన్స్, ముఖ్య పాత్రలకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అందులో భాగంగానే మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న కన్నప్ప సినిమాలో కీలకమైన పార్వతీదేవి పాత్రలో నటించింది. శివుని భక్తుడి సినిమా అయిన కన్నప్పలో పార్వతి దేవికి ఏ స్థాయి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనుక ఆమె కనిపించేది కొద్ది సమయం అయినా కథలో కీలకం కానుంది.
🌟 Divine Grace Personified 🌟
Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY
— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025