Chandrababu and Pawan Kalyan: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడకు చేరుకున్న విషయం విదితమే.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగనుంది.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. అందులో భాగంగా.. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Read Also: Delhi Weather: ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత.. నేడు తేలికపాటి వర్షం!
ఇక, తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను భారీ ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనుంది టీడీపీ, జనసేన.. అంతేకాదు.. తామిచ్చిన ఫిర్యాదుపై సీఈవో ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శిస్తోంది టీడీపీ.. ఈ వ్యవహారాన్ని కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సీఈసీకి ఇచ్చే రిప్రజెంటేషన్‌లో ప్రధానంగా టీడీపీ – జనసేన ప్రస్తావించేందుకు సిద్ధమైంది. మరోవైపు.. సచివాలయ సిబ్బంది వైసీపీ తరఫున ‘జగనే ఎందుకు కావాలనే’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేయనున్నారు. అధికారులు, పోలీసుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పట్టిమచుకోవడం లేదని కంప్లైంట్ ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు.
Read Also: Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోనున్న పవన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ముందుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు.. చంద్రబాబు నివాసంలో జనసేనాని అల్పాహార విందు స్వీకరిస్తారు. అనంతరం, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. విజయవాడలో సీఈసీ కమిటీ సభ్యులను కలిసేందుకు బయల్దేరివెళ్లనున్నారు..