S Jaishankar: చైనాతో భారత సంబంధాలు నార్మల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చైనా కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మద్య సంబంధాలు క్షీణించాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు దేశాలు సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నాయి.
Read Also: Air India crash: ఎయిర్ ఇండియా క్రాష్, “ఫ్యూయల్ స్విచ్”ల తనిఖీకి ఆదేశాలు..
ఈ నేపథ్యంలో చైనాలో ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. ‘‘ఒకరికొకరు విజయాన్ని సాధించడానికి వీలుగా భాగస్వామ్యం ఏర్పాటు చేయడం, డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్ సాధించడం సరైన ఎంపిక. ఒకరి ఆందోళనల్ని మరొకరు గౌరవించుకోవాలి. చైనా-భారత్ సంబంధాల స్థిరమైన ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించాలి’’ అని జెంగ్ సోమవారం జైశంకర్‌ని కలిసిన తర్వాత అన్నారు. డ్రాగన్, ఏనుగు అనేది చైనా, భారత్ దేశాలను సూచిస్తుంది. గతంలో ఆదేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా భారత సంబంధాల విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ravindra Jadeja: ఎంతకు తెగించార్రా.. గెలుపు కోసం మరీ ఇంతకు దిగజారాలా..? వీడియో వైరల్
ఉపాధ్యక్షుడితో భేటీ తర్వాత, జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఇరువురు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. “2024 అక్టోబర్‌లో కజాన్‌లో మా నాయకుల( మోడీ-జిన్ పింగ్) సమావేశం నుండి, భారతదేశం-చైనా సంబంధం క్రమంగా సానుకూల దిశలో కదులుతోంది. ఆ ఊపును కొనసాగించడం మా బాధ్యత. ఇటీవలి కాలంలో, మా ఇద్దరికీ అంతర్జాతీయ కార్యక్రమాలలో కలుసుకోవడానికి, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి అనేక అవకాశాలు లభించాయి. ఇది ఇప్పుడు క్రమం తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని జైశంకర్ అన్నారు. కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించినందుకు విదేశాంగ మంత్రి చైనాకు కృతజ్ఞతలు తెలిపారు. జైశంకర్ చైనా పర్యటనలో రేర్ ఎర్త్ అయస్కాంతాల ఎగుమతి, రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్, ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.