మహిళా సాధికారత కింద మోడీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. సీఐఎస్ఎఫ్ తొలి మహిళా బెటాలియన్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళల సాధికారత, జాతీయ భద్రతలో వారి పాత్రను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.