దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
ఢిల్లీ – దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు సైబర్ నేరాలను అడ్డుకుంటూనే మరోపక్క నేరస్థుల నుంచి రికవరీలు కూడా చేస్తున్నారు. దేశంలో సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ జరిగింది. అయితే రికవరీ అయిన సొమ్మును బాధితులకు రీఫండ్ చేసే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సులభతరం చేసే అంశంపై కేంద్రం యోచిస్తోంది. అత్యంత ప్రాధాన్యత…
మహిళా సాధికారత కింద మోడీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. సీఐఎస్ఎఫ్ తొలి మహిళా బెటాలియన్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళల సాధికారత, జాతీయ భద్రతలో వారి పాత్రను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Central Government: భారతదేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,858.60 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు విడుదల చేసింది.
ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పొలిటికల్ దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే జైల్లో నుంచి కేజ్రీవాల్ పరిపాలించడం కుదరని వీకే సక్సేనా వ్యాఖ్యానించారు.
ఏపీ విభజన చట్టంలోని అంశాలు- అమలుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, 13వ షెడ్యూల్ అనుసరించి ఆస్తుల విభజన తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
Union Home Ministry: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.…
ఆక్స్‌ఫామ్ ఇండియాపై సీబీఐ సోదాలు నిర్వహించింది. భారత విదేశీ నిధుల నిబంధనల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆక్స్‌ఫామ్ ఇండియా, దాని ఆఫీస్ బేరర్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది.