Kumkum on Coconut: హిందూ సాంప్రదాయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. అయితే టెంకాయ కొట్టిన తర్వాత ఆ చిప్పల మీద కుంకుమ బొట్టు పెట్టాలా? వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరికాయకు ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. దీనికి ప్రధాన కారణం ‘శుద్ధత’. దేవుడికి సమర్పించే ప్రసాదం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, మనం తినడానికి…