రోడ్డు ప్రమాదాలకు తోడు అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. అరకులో ఓ టూరిస్ట్ బస్సులో మంటలు వ్యాపించి మొత్తం తగలబడిపోయింది. అరకు వ్యాలీలో టూరిస్టులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో రెండో నెంబర్ మలుపు దగ్గర ఓ టూరిస్టు బస్సు తగలబడిపోయింది. ప్రయివేట్ ఆపరేటర్ కు చెందిన ఈ బస్సు ప్రమాదానికి గురయ్యే సమయంలో 24మంది ప్రయాణీకులు వున్నారు. విహార యాత్ర ముగించుకుని విజయనగరం (vizianagaram) తిరిగి వెళుతుండగా అనూహ్యంగా ఈ ప్రమాదం ఎదురైంది.
Read Also: Minister Roja: పవన్‌కు కౌంటర్.. జగన్ ఎడమకాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేడు
బస్సు పూర్తిగా దగ్ధం అయిపోగా ప్రమాదం గుర్తించిన పర్యాటకులు ఎలాగోలా ప్రాణాలను కాపాడుకోగలిగారు. అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పర్యాటకుల లాగేజ్ పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో లగేజ్ కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోయారు ప్రయాణికులు. బస్సు ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో మంటలు విపరీతంగా వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ కి గురయ్యారు.
Read Also: Minister Roja: పవన్‌కు కౌంటర్.. జగన్ ఎడమకాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేడు