NTV Telugu Site icon

Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోంది

Boora Narsaiah

Boora Narsaiah

Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు ఏడాదిలో 24 సార్లు ఢిల్లీకి వెళ్లి రికార్డు సృష్టించారన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలని లక్షల కోట్లు అభివృద్ధికి కేటాయించారని, మోసపోతే గోసపడుతామని ఎన్నికలకు ముందే మేము చెప్పామని బూర నర్సయ్య తెలిపారు.

Sukhvinder Sukhu: సీఎంను చుట్టుముట్టిన “కోడి కూర” వివాదం.. అసలేం జరిగింది? (వీడియో)

బీజేపీ తెలంగాణలో అధికారంలో ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, రేవంత్ రెడ్డి.. పదే పదే నిధులు కావాలని విజ్ఞప్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు ఇచ్చినా అంతా తామే అభివృద్ధి చేశామని పబ్లిసిటీ కాంగ్రెస్ చేసుకుంటోందని, సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా పరిస్థితి మారిందని ఆయన మండిపడ్డారు. గల్లీ మే గాళీ.. ఢిల్లీ మే డోలి అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ అధికారం బీజేపీదే అనే బూర నర్సయ్య గౌడ్‌ ఉద్ఘాటించారు. అందరూ బీజేపీ అసలు పోరాటాలు చేయడంలేదని అనుకుంటున్నారని, బీజేపీ సభా పర్వం, సభ్యత్వ పర్వం, సంఘటన పర్వం నడుస్తోందన్నారు. సంగ్రామ పర్వం జనవరి నుంచి మొదలవుతుందని, అసలు ఫైర్ లేదని అంటున్నారు.. వైల్డ్ ఫైర్ చూస్తారన్నారు. తగ్గేదెలే.. అన్నట్లుగా కలిసి పని చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy : మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటాం

Show comments