Site icon NTV Telugu

India-Pakistan War: పాకిస్థాన్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు.. షరీఫ్‌ను తరలించిన పాక్ సైన్యం..

Shehbaz Sharif

Shehbaz Sharif

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించింది.

READ MORE: India-Pakistan War: యుద్ధ బరిలోకి INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం?

ఇప్పటికే పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. భారతదేశం పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థతో సహా అనేక క్షిపణులను ధ్వంసం చేసింది. F-16 ఫైటర్ జెట్, రెండు JF-17 ఫైటర్ జెట్‌లతో సహా మూడు పాకిస్థాన్ ఫైటర్ జెట్‌లను కూడా భారతదేశం కూల్చివేసింది. భారత సాయుధ దళాలు ఇద్దరు పాకిస్థాన్ ఫైటర్ జెట్ పైలట్లను సజీవంగా పట్టుకున్నాయి. నివేదికల ప్రకారం, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక పైలట్‌ను సజీవంగా పట్టుకున్నారు. మరొకరిని జమ్మూ జిల్లాలోని అఖ్నూర్‌లో సజీవంగా పట్టుకున్నారు.

READ MORE: India-Pakistan War: భయం గుప్పిట్లో పాక్.. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై భీకర దాడి..

మరోవైపు.. ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీడీఎస్ జనరల్, ఆర్మీ, నేవీ, వైమానిక దళ అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సరిహద్దులో సైనిక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

READ MORE: Big Breaking : భారత్‌ ఆర్మీ అదుపులో పాక్‌ పైలట్‌

Exit mobile version