Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తాలిబన్‌లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించింది.