Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్‌లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.
Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Pakistan denies: పాక్ మరోసారి ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసింది. అది ఏ విషయంలో అంటే.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసినట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే కదా. దీనిపై పాకిస్థాన్ మరోసారి నోరుపారేసుకుంది. ఉగ్రవాద శిబిరాలను ఇండియా నేలమట్టం చేసినప్పటికీ.. తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది.…
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక…
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఎప్పటికి మర్చిపోలేనిది. అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూక పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాదులతో విరుచుకుపడి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన. అయితే ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది హరోలు రియాక్ట్ అయ్యారు. కానీ బాలీవుడ్ సెలబ్రిటీలు ఆపరేషన్ సిందూర్ గురించి పెదవి విప్పడం లేదంటూ ఇటీవల కొన్ని విమర్శలు ఎదురైనా విషయం తెలిసిందే. దీంతో కొందరు బీ టౌన్ ప్రముఖులు…
అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్, రాజస్థాన్, గుజారాత్ రాష్ట్రంలోని బార్డర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన వైఖరి తీసుకుంది. పాకిస్థాన్‌ను తిప్పికొట్టాలని నిర్ణయించింది.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం…
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు.…
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం…
India Pak War : పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దుశ్చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. శనివారం ఉదయం నుంచే జైసల్మేర్ వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ అప్రమత్తమయ్యారు. నగరమంతా ఖాళీ చేయిస్తున్నారు. భయానక సైరన్‌ల మోతతో జైసల్మేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జైసల్మేర్‌కు కేవలం 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే ముప్పు ఇంకా పొంచి ఉందన్న హెచ్చరికలతో…