50 ఏళ్లుగా అధికారంలో ఉండి ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయని కాంగ్రెస్ పార్టీ.. బీసీలను రాజకీయంగా ఎదగనియ్యని నాయకుడు ఎమ్మెల్యే సంజయ్ అని ఆమె మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రం లో ని స్థానిక నివాసంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ముదిరాజ్ లను తిడుతుంటే.. అప్పుడు మాట్లాడరని, కేంద్రం నుండి వచ్చిన నిధులను పేరు మార్చి వినియోగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగిత్యాల గంజాయికి గేట్ వే గా మారిందని ఆమె విమర్శించారు.
Also Read : Pragya Jaiswal : తడి అందాలతో హీటేక్కిస్తున్న కంచె బ్యూటీ..
యువకులు గంజాయికి బానిసలవుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 8650 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, మిస్టర్ ఎమ్మెల్యే మీకు రైతులకు కులాల వారీగా విభజించి లెక్కలు చెప్పమని ఎవరు చెప్పామన్నారన్నారు. రైతులను సైతం రాజకీయంగా విభజించిన ఏకైక వ్యక్తి మీరే అని, బీసీ బంధుకు కేవలం 15 రోజులు ఇచ్చారని, జగిత్యాల రూరల్ ఎంపీపీ ఏమైంది…? జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సీటు ఏమైంది..? అని ఆమె ప్రశ్నించారు. జగిత్యాల కు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఓసి కాబట్టి వెంటనే భర్తీ చేశారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పాలనతో ప్రజలు విసిగిపోయారు.. రానున్న రోజుల్లో ప్రజలు బుద్ది చెప్తారని ఆమె వ్యాఖ్యానించారు.