Layoff problems: ఆర్థికమాంద్యం భయాల వల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు మానసికంగా చాలా వేదన అనుభవిస్తున్నారు. కొందరు ఎన్ని ఉద్యోగాలకు అఫ్లై చేసిన ఉద్యోగం దొరకని పరిస్థితి ఏర్పడింది. స్విగ్గీ నుంచి తొలగించబడిన ఉద్యోగి ప్రతీ రోజు 100 కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నానని.. అయితే తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాలేదని వెల్లడించారు.
Read Also: Akshara Gowda: ఓ మై గాడ్ అనిపిస్తున్న అక్షరా గౌడ్ అందాలు.. దుస్తులన్నీ ఉన్నా ఏమీ లేనట్టే!
తాను మూడు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నానని వెల్లడించారు. తన అనుభవాలను లింక్డ్ ఇన్ ద్వారా పంచుకున్నాడు. రోజుకు 4-5 ఇంటర్వ్యూ ఉంటున్నా, వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని.. నా కుటుంబంలో నేనొక్కడిని ఉద్యోగం చేసేవాడినని తన ఆవేదనను లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశాడు. ‘‘నా కుటుంబం పూర్తిగా నాపై ఆధారపడి ఉంది. పరిస్థితి నాకు చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ, నేను కష్టపడుతున్నాను, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆశ కోల్పోతున్నాను. నాకు నిజంగా సహాయం చేయగలితే వారుంటే సాయం చేయాలి. నాకు సలహాలు, సూచనలు అందించాలి. నా ప్రయాణంలో ఉన్న గొప్ప వ్యక్తుల్ని నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు’’ అంటూ పోస్ట్ లో రాశాడు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం ఈ ఏడాది ప్రారంభంలో తన మొత్తం సిబ్బందిలో 6 శాతం మందిని తొలగించింది. దాదాపుగా 380 మంది ఉద్యోగాలని కోల్పోయారు. ఆర్థిక పరిస్థితులు సవాల్ గా మారడం, ఉద్యోగుల తొలగింపుకు కారణమైందని స్విగ్గీ పేర్కొంది. ఫుడ్ డెలివరీ వృద్ధి రేటు మందగించిందని, ఫలితంగా లాభాలు తగ్గాయని, ఆదాయం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. స్విగ్గీనే కాదు ముఖ్యంగా టెక్ సంస్థలు వేలల్లో తమ ఉద్యోగాలను తొలగించాయి. ప్రముఖ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగుల్ని పీకిపారేశాయి.