జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించిన విషయం విదితమే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్ర పతి చేతుల్లోకి వచ్చాయి. నేడు అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్‌లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉందని అన్నారు.