Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం మమతా బెనర్జీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఈ ఘటనపై ఆరోపణలు చేసిన పలువురికి బెంగాల్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి కోల్‌కతా పోలీసులు బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ, కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామి అనే ఇద్దరు వైద్యులకు సమన్లు జారీ చేశారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్‌లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉందని అన్నారు.