విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ అధ్యక్షురాలు దగ్గబాటి ఫురంధేశ్వర తీరుకు నిరసనగా ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యయత్నం చేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అంజనాచౌదరి అనే మహిళా కార్యకర్త.. పార్టీలో వేధింపులు భరించలేక బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందే పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేసింది. మహిళా నాయకురాలిని వేధించిన పార్టీ నాయకుడికి పురందేశ్వరి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఆమె మనస్తాపంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
అయితే, ఈ సందర్భంగా మహిళా నాయకురాలు అంజనా చౌదరి తన మనుసులోని ఆవేదనను బయటకు కక్కివేసింది. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాలలోకి వచ్చినట్లు అంజానా చౌదరి తెలిపింది. 26వ వార్డు మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో వివాదం జరిగిందని.. అప్పటి నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి తనను టార్గెట్ చేసినట్లు ఆమె పేర్కొనింది. బీజేపీ వర్క్ షాప్ జరిగినపుడు వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చేటప్పుడు వీడియోలు తీసి వాటిని వైరల్ చేశారని అంజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Jyothika : సూర్య ను పెళ్లి చేసుకోవడానికి కారణం అదే..
ఇక, ఈ విషయాన్ని అప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లినట్లు అంజనా చౌదరి తెలిపింది. సోము వీర్రాజు ప్రశాంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆమె పేర్కొనింది. కానీ, ప్రస్తుత బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాత్రం మళ్ళీ వాళ్లకు పదవులు ఇచ్చి, తనను సస్పెండ్ చేసినట్లు అంజనా చౌదరి ఆరోపించింది. పార్టీలో అవమానం తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు అంజనా చౌదరి వాపోయారు. తన చావుకు కారణం రాజంపేట బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు నాగోతు రమేష్ నాయుడు, ప్రశాంత్ అని ఆమె పేర్కొంది. పార్టీ అధ్యక్షురాలు మహిళ అయినా ఒక మహిళగా తనకు అన్యాయం జరిగిందంటూ అంజనా చౌదరి కన్నీరు పెట్టుకుంది.