కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక బెస్ట్ కపుల్ గా పేరు పొందారు.సినిమా ఇండస్ట్రీలో సూర్య, జ్యోతికలాంటి స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లి కామనే అయినా కూడా ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా వుంటూ దాంపత్యం జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతోమందికి ఆదర్శం.అయితే వారి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందట.. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.బుధవారం (అక్టోబర్ 18) తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా తమ పెళ్లి నేపథ్యాన్ని ఆమె చెప్పుకొచ్చారు.. అంతా కూడా నెల రోజుల్లోనే అయిపోయినట్లు ఈ సందర్భంగా జ్యోతిక చెప్పుకొచ్చారు.. “సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి అతడు నాకు ఇచ్చిన గౌరవమే ప్రధాన కారణం. మేము తొలిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో కలిసి నటించాం. నాతో ఆయన చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత ఏడు సినిమాల్లో మేమిద్దరం కలిసి నటించాం. ఎవరైనా డైరెక్టర్ ఓ రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు సూర్య అంత వరకే నటించేవాడు. దానిని అదునుగా అయితే అస్సలు తీసుకునేవాడు కాదు. ఆ గౌరవమే నన్ను ఎంతగానో ఆకర్షించింది.
ఇక నేను అప్పటికే 10 ఏళ్ల పాటు షూటింగ్ లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకూ పని చేసీ చేసీ ఎంతో అలసిపోయాను. నాకు అవసరమైనంత డబ్బు అప్పటికే సంపాదించేశాను. ఆ సమయంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. నా కుటుంబం కూడా మా పెళ్ళికి అంగీకరించింది. దీంతో మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆ తర్వాతి నెలలోనే మేము పెళ్లి చేసుకున్నాం” అని జ్యోతిక వివరించింది.అంతేకాదు జ్యోతిక సూర్యపై మరిన్ని ప్రశంసలు కురిపించింది. “ఇదేదో మామూలుగా చెప్పడం లేదు. అతడు ఓ తండ్రిగా చాలా సిన్సియర్. తండ్రిగానే కాదు భర్తగా కూడా సిన్సియరే. సూర్యను చూసి చుట్టు పక్కల వారి భార్యలు.. అతన్ని చూసి నేర్చుకోండి అని తమ భర్తలకు చెప్పడం కూడా నేను చూశాను. మేము గడిపిన ఎన్నో మధురమైన క్షణాలను అతడు ఇప్పటికీ మరచిపోలేదు. ప్రతిదీ కూడా గుర్తంచుకుంటాడు” అని జ్యోతిక చెప్పింది.అందుకే సూర్య అంటే నాకు చాలా ఇష్టం అని జ్యోతిక చెప్పుకొచ్చారు.