Manchu Lakshmi: స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీం తీర్పు.. గుండె పగిలిపోయింది, దేశానికి ఇది నిజమైన అవమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi on Same Sex Marriage: స్వలింగ సంపర్కులు చేసుకునే పెళ్లిళ్లకి చట్ట బద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. వాటికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కింద లీగల్‌గా గుర్తింపును ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు సంబంధించిన చట్టాన్ని మార్చే అంశం పార్లమెంట్ పరిధిలో ఉందని వెల్లడించింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై మంగళవారం నాడు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే స్వలింగ సంపర్కులకు సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడింది. స్వలింగ జంటలు తమ పెళ్ళిళ్ళను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లెయిమ్ చేయరాదని తీర్పు ఇచ్చింది.
Yukti Thareja: బ్లాక్ డ్రెస్సులో కాక రేపుతున్న యుక్తి తరేజా
Also Read
ఇక ఈ బెంచ్ ఇచ్చిన కీలక తీర్పుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం వ్యక్తం చేయగా ఈ తీర్పు విషయంపై ఆర్ఎస్ఎస్, ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా ఈ హింద్ కూడా స్వాగతించాయి. అయితే ఎల్‌జీబీటీక్యూఐఏ++ కమ్యూనిటీ, యాక్టివిస్టులు, పిటిషనర్ల నుంచి మాత్రం ఈ తీర్పు మీద భిన్న స్పందన లభించింది. సుప్రీం ప్రస్తావించిన పాజిటివ్ అంశాలపై కొందరు హర్షం వ్యక్తం చేయగా.. చట్టబద్ధత కల్పించలేమని చెప్పడంపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపించాయి. అయితే టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఈ వ్యవహారం మీద తాజాగా స్పందించారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పుపై నేను చాలా నిరాశతో రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది అని ఆమె పేర్కొన్నారు అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం అని పేర్కొన్న ఆమె ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన స్వంత దేశంలో దీనిని తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు.
My heart is broken as I write with such disappointment over the Supreme Court's verdict refusing to legalize same-sex marriage. It is a true shame for a country that has embraced all forms of love and taught the rest of the world about love, yet has been denied this in its own…
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 18, 2023
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!