బయట చల్లగా చిరు జల్లులు పడుతుంటే.. లోపల ఓ మాదిరిగా ఉంది.. కారంగా, వేడిగా ఏదైనా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు..వేడిగా ఘాటు ఘాటుగా ఉండే మిర్చి బజ్జీ, పానీ పూరీ, పకోడీ, సమోసాలు,చాట్ వంటి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది.. మామూలు రోజుల్లో ఇలాంటి ఆలోచన అస్సలు రాదు.. అందుకు కారణం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా వేడిగా ఎందుకు తింటారో ఒకసారి చూసేద్దామా..
వర్షాకాలంలో మన శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరొటోనిన్ స్థాయులు తగ్గిపోతాయి. దానికి కారణం సూర్యరశ్మి లేకపోవడం.దీంతో శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. దీంతో వీటిని ఎడ్జెస్ట్ చేయటానికి మన శరీరం కార్బోహైడ్రేట్లు కావాలని కోరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరొటోనిన్ స్థాయుల్ని పెంచుతాయి. దీంతోపాటే డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ లో తేమ లేకుండా పొడిగా ఉంటాయి. నోట్లోవేసుకోగానే కరకరలాడతాయి. మన చుట్టూ ఉన్న చల్లని వాతావరణానికి ఈ ఆహారం తింటే మనకు నచ్చుతుంది.. అందుకే జనాలు అలాంటి వాటి కోసమే వెతుకుతారు..
వర్షాకాలంలో క్రిస్పీగా, ఫ్రై చేసిన స్నాక్స్ తినాలనిపిస్తుంది. కాస్త కారం కారంగా ఉండేవి తినాలనిపిస్తుంది. వర్షాకాలంలో స్పైసీ స్నాక్స్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ బండి కనిపిస్తే ఠక్కున ఆగిపోయిన ఓ ప్లేట్ తీసుకుని వెంటనే వేడి వేడిగా లాగించేయాలనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో చల్లదనం పెరిగి లోపలికి వేడిగా.. కారంగా వెళితే బాగుండు అని అనుకుంటారు.. ఇక స్పైసీ ఫుడ్ తినాలనిపించటానికి వేరే కారణాలు కూడా ఉంటాయట. మనకు నిరుత్సాహంగా ఉన్నా అటువంటి ఆహారం తినాలనిపిస్తుందట. స్పైసీ ఫుడ్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుందట. డిప్రెస్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాన్ని కోరుకుంటుందట శరీరం. మీకు నిరాశగా అనిపించినప్పుడు స్పైసీ ఫుడ్ తింటే ఉపశమనం కలుగుతుందట.. అలాగని అదేపనిగా తినడం కూడా మంచిది కాదు.. ఇక జలుబు, దగ్గు వల్ల కూడా స్పైసి ఫుడ్ తినాలని అనుకుంటారు.. అదన్న మాట.. అసలు నిజం..