Ramchander Rao: ఎంతో మంది కార్యకర్తల త్యాగాల ఫలితంతోనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది అని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. నాకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వడం గర్వంగా భావిస్తున్నాను.. ప్రతి కార్యకర్త గర్వించాలి.. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.
Maharashtra: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర చవాన్ మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడిగా కిరణ్ రిజిజూ హాజరైనట్లు ఆయన వెల్లడించారు. రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి…
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠ నేపథ్యంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై అనవసర చర్చలు, విమర్శలు అర్ధహీనమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక కట్టర్ కేడర్‌తో కూడిన పార్టీ అని, రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు బండి సంజయ్. అధికారం…
మాజీ కేంద్ర మంత్రి, టెక్నోక్రాట్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు.
Off The Record: తెలంగాణ బీజేపీలో సమన్యాయం జరగడం లేదా? సూపర్ పవర్స్, రెగ్యులర్ పవర్స్ అంటూ వేర్వేరుగా నిర్ణయాలు జరుగుతున్నాయా? రాష్ట్రం మొత్తం జిల్లాల అధ్యక్షుల నియామకాలు పూర్తయినా ఆ రెండు జిల్లాల్లో మాత్రం ఎందుకు పెండింగ్‌లో పడ్డాయి? అక్కడ అడ్డుపడుతున్న బలమైన శక్తులేవి? ఆ వ్యవహారం పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందా?.
ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
కలలో కూడా ఊహించలేదు.. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను 3 సార్లు ఎమ్మెల్యే అవుతానని, కేంద్ర మంత్రి అవుతానని అనుకోలేదు.. ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేశాను-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యుద్ధమంటూ జరిగితే.. కత్తికి కూడా కనికరం ఉంటుందేమో.. కానీ, తెలంగాణ ప్రజలకు కనికరం ఉండదు.. బండి సంజయ్ ఉన్నప్పుడే యుద్ధం ప్రారంభమైంది.. ఇంకా ముందుంది ముసళ్ల పండుగ-కిషన్‌రెడ్డి
ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది.
Bandi Sanjay: అభివృద్ధి నిధుల పై ముఖ్యమంత్రి చర్చకి వస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ కార్యకర్తలతో టిఫిన్ బైటక్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.