Bhumana Karunakar Reddy: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీడీఆర్ బాండ్లు విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు.. నాపై వచ్చే విమర్శలకు నేను ఎప్పుడూ స్పందించను.. కానీ, రెండు సంవత్సరాలు నా మనసులో ఉన్న అభిప్రాయం ఇది అన్నారు.. గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి… అవినీతిలో అనకోండ లాంటి అధికారి అని ఆరోపించిన ఆయన.. గతంలో మంత్రులను అందరి పూచికపుల్లలా చూసింది.. తన శాఖకు సంబంధించిన మంత్రులను లెక్క కూడా చేయాని అధికారి.. డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నైతిక విలువలు లేని అధికారిని.. ఓ తాటకీలాగా కింది స్థాయి అధికారుల పట్ల వ్యవహరించారు అంటూ విమర్శలు గుప్పించారు..
Read Also: Bollywood : పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఇచ్చిన సౌత్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో
తిరుపతిలో రోడ్లు వేస్తున్న సమయంలో అ అధికారిని టీడీఆర్ బాండ్ల ద్వారా దోచుకోవాలని ప్లాన్ వేస్తే మేం అడ్డుకున్నాం.. ఇది తట్టుకోలేక నెల్లూరు జిల్లా నేతలకు సమాచారం లీక్ చేసి రెండు వేల కోట్లు దోచుకున్నారంటూ ప్రచారం చేయించింది.. ఒక్క రూపాయి అవినీతి చేసినా మేము ఎలాంటి శిక్షకైన రెడీ అని ప్రకటించారు భూమన.. టీడీఆర్ బాండ్లు విషయంలో ఎలాంటి విచారణ అయినా సిద్ధం అని సవాల్ చేశారు.. గత అవినీతి అధికారి 35 ఏళ్లుగా తను ఎక్కడ పనిచేసిన వందల వేల కోట్లు లూఠీ చేశారని ఆరోపించారు.. సుప్రీంకోర్టు సైతం అమె అవినీతి తెలుసు అంటూ చెప్పింది… అవినీతి అధికారిని రోజు ధరించే చీర ఖరీదు ఒకటిన్నర లక్ష రూపాయలను అని పేర్కొన్నారు.. వేల రూపాయలు విలువ చేసే 11 విగ్గులు ధరిస్తుంది… నీతిగా నిజాయితీ ఉండే నాపైనా కక్ష్య గట్టి నామీదా కుట్రతో అసత్య ప్రచారం చేస్తోంది.. 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతిని అభివృద్ధి చేశాం అన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి..