Bollywood : పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఇచ్చిన సౌత్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తీక్ ఆర్యన్ మంచి గేర్ మీదున్నాడు. భూల్ భూలయ్యా3 మాసివ్ హిట్టుతో కార్తీక్ రేంజ్ బీటౌన్‌లో పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు మరోటి సెట్ చేస్తున్నాడు. అయితే స్పీడులో ర్యాంగ్ డైవర్షన్ వైపు టర్న్ తీసుకుంటున్నాడు. తన లైనప్‌లో ఓ ప్లాప్ మేకర్‌కు ఛాన్స్ ఇచ్చాడట. పంజాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డిజాస్టర్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ విష్ణు వర్థన్‌తో ఓ జాంబి ఫిల్మ్ చేయబోతున్నాడట కార్తీక్.
Also Read : Mollywood : మలయాళ ఇండస్ట్రీలో ‘ఓనం’ సినిమాల మధ్య పోటీ.. గెలిచేదెవరో?
Also Read
- Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
- Idupu Kayitham Teaser: 'ఇడుపు కాయితం' అంటే.. విడాకులా..?
- Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
- Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
విష్ణు తమిళంలో ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ కొన్ని రోజుల నుండి చెప్పుకోదగ్గ చిత్రాలేమీ లేవు. 2021లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సిద్దార్థ్ మల్హోత్రాతో ‘షేర్సా’ తెరకెక్కించాడు. పాండమిక్ కారణంగా బొమ్మ ఓటీటీకి పరిమితమైంది. మంచి వ్యూస్ దక్కించుకుంది. ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి తీసిన తమిళ్ ఫిల్మ్ నెసిప్పాయా బాక్సాఫీస్ బాంబ్‌గా మారింది. ఇప్పుడు ఇతగాడితో వర్క్ చేయాలనుకోవడం అంటే కార్తీక్ రిస్క్ చేస్తున్నట్లే. బాలీవుడ్ హీరోలకూ రానూ రానూ కోలీవుడ్ దర్శకులపై ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. ఖాన్ త్రయానికి తమిళ ఫిల్మ్ మేకర్ల సత్తా ఏంటో తెలుసు సల్మాన్ ఖాన్- ప్రభుదేవాతో, షారూఖ్- అట్లీతో, లోకేశ్ కనగరాజ్‌తో అమీర్ ఖాన్ మంచి హిట్స్ చూశారు. వీళ్ల కెరీర్ డ్యామేజ్ అవుతున్న టైంలో తమకు బెస్ట్ ఫిల్మ్స్ కావాలనుకున్నప్పుడల్లా కోలీవుడ్ దర్శకులు స్టార్లకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను కార్తీక్ ఆర్యన్ కూడా వర్కౌట్ చేయాలనుకుంటున్నట్లున్నాడు. బాలీవుడ్ హీరోకు విష్ణు వర్ధన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
-
UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
-
Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
-
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!