సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చేరుకోగా గ్రామ శివారులో గొల్ల పెంటయ్య- లక్ష్మమ్మ దంపతులు పాదయాత్రకు ఎదురొచ్చి వాళ్లు నివసిస్తున్న పూరి గుడిసెలోకి భట్టి విక్రమార్కుని తీసుకువెళ్లారు. ప్లాస్టిక్ కవర్లతో వేసుకున్న కప్పు, కర్రలు పాతుకుని దానికి అడ్డం పెట్టుకున్న తడకలు చూయిస్తూ ఇదే మా సొంత ఆస్తి ఈ గుడిసేనే అంటూ…. ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా ఇంటి కోసం ఎమ్మెల్యే, గ్రామ సర్పంచును అడిగి విసిగి వేసారి పోయామని, ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు.
Also Read : Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే
వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణుకుతూ, పాములు, తేళ్లతో సహజీవనం చేస్తున్నామని ఇంతటి దౌర్భాగ్య దుస్థితిలో బతుకుతున్న తమకు ఎవరు సాయం చేయడం లేదని తన గుడిసె చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలు చదువుకున్నప్పటికీ కొలువులు రాలేదని, వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి వెంకటయ్యకు పింఛన్ రావడంలేదని మొరపెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొట్టమొదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇప్పిస్తానని, చదువుకున్న పిల్లలకు కొలువులు ఇందిరమ్మ రాజ్యంలోనే వస్తాయని ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ను గెలిపించుకోవాలని భట్టి విక్రమార్క వాళ్లకు చెప్పారు
Also Read : Sharad Pawar: ప్రధాని రేసులో నేను లేను.. విపక్షాల ఐక్యతే ముఖ్యం..