భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల గుత్తి కోయల దాడిలో ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మంలో ఫారెస్ట్ అధికారి బలి కావడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారం ఆలస్యం చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తాం అని చెప్పి ఇవ్వకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. భూమిపై హక్కు కోల్పోయాం అనే బాధతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో ల్యాండ్ అసైన్డ్ కమిటీ లు ఉండేవన్నారు. కానీ.. కేసీఆర్ వచ్చాక ఒక్క కమిటీ లేదు..కమిటీ మీటింగులే లేవని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది తెలంగాణలో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Guntur Mayor ManoharNaidu: గుంటూరు అభివృద్ధిపై చర్చకు రెడీ
అంతేకాకుండా.. ‘ప్రజల సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ.. టీఆర్‌ఎస్ కుట్ర పూరితంగా వ్యవహారం చేస్తున్నాయి. సమస్యల నుండి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఈడీ ఒకరి మీద… ఏసీబీ ఇంకొకరి మీద దాడులు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు.. ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పక్కన పెట్టి తమ సమస్యల మీదనే దృష్టి పెట్టాయి. ప్రస్తుత రాజకీయం అంతా నవ్వులాట లెక్క మారింది. సంస్థలు.. వ్యవస్థలు అన్నీ టిని ఇతరుల మీద దాడికి ఉప యోగిస్తున్నారు. పోడు భూముల పై మంత్రుల కమిటీ కూడా చట్ట ప్రకారం పని చేయడం లేదు. గతంలో ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదా..? పార్టీలు ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలు భూతద్దం లో పెట్టి చూపిస్తున్నాయు.
Also Read : Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
రెగ్యులర్ గా జరిగే దాడులే. ఐటీ.. ఈడీ దాడులు విధి నిర్వహణలో జరిగేవే. రాజకీయ కక్షతో చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు చిత్రీకరిస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ విడకుండా ఉండాల్సింది. కానీ ఆయన చెప్పిన కారణాలు సరికాదు. బీజేపీ దేశానికి ప్రమాదం. మర్రి చెన్నారెడ్డి లౌకిక వాది. చెన్నారెడ్డి కొడుకుగా ఆయన నిర్ణయం సరికాదు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయలని కుట్ర చేస్తున్న పార్టీల వ్యూహం లో భాగంగా ఆరోపణలు చేయిస్తున్నారు. జగ్గారెడ్డి మాటలు విన్నాను. మేము వైఫల్యం చెందాము అనే భావనలోకి ఆయన వచ్చి అలా అని ఉంటారు. నాతో ఎక్కడ ఏం చేయాలో చెప్తే అది చేసేవాణ్ణి. పార్టీకి క్యాన్సర్ వచ్చింది అనే మాటను ఖండిస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.