గత పదేళ్ళలో గుంటూరు నగరం ఎంత అభివృద్ధి సాధించింది, ఎవరు ఏం చేశారనేదానిపై బహిరంగ చర్చకు రెడీ అన్నారు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఈసందర్భంగా ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజధాని నగరం పేరుతో గుంటూరు రోడ్లను చిన్నాభిన్నం చేశారు. గుంటూరు రోడ్డు అంటే గుంతల రోడ్డుగా మార్చేశారు. గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని సొంత అవసరాలకు వాడేసుకున్నారు… జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ క్రమబద్ధీకరించే పనిలో అధికారులు గుంటూరు కార్పొరేషన్ పాలకవర్గం ఉందన్నారు మనోహర్ నాయుడు.
Read Also: Ram Charan-NTR: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా నిజమేనా?
గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ పరిధిలో నిధులు గోల్ మాల్ చేసిన వ్యవహారాల్లో విచారణ చేపడతాం అన్నారు మేయర్ మనోహర్ నాయుడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులేంటో జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధితో ఎంతో చర్చించేందుకు సిద్ధమేనన్నారు. గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గుంటూరు ప్రజలు నేడు చూడబోతున్నారు. రాజకీయాలు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకుల పనిలా కనిపిస్తుందన్నారు. అధికార దాహంతో కోర్టులను, మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు మండిపడ్డారు.
Read ALso: Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్