వర్షాల నేపథ్యంలో చెట్లు, స్థంబాలు, విద్యుత్ వైర్స్ ఒరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం దేశానికి తలమానికమని, హైదరాబాద్ కు చాలా మల్టిలేవల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సూచించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో అధికారులతో మాట్లాడి ముందుకు వెళ్తామని, సుంకిశాల గోడ కూలిందని చూశానని, హైదరాబాద్ కి నీటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మాణమన్నారు.
Foreign Drugs: విదేశీ మందులకు ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ మినహాయింపు..!
గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల్లోనే క్వాలిటీ లేదు అనుకున్నామని ఆయన తెలిపారు. గోదావరి కాకుండా కృష్ణనదిలో నిర్మాణం అయ్యే వాటిని వదలలేదు అని అర్ధం అవుతుందని, 11.06.2021 న బీఆర్‌ఎస్ హాయంలో అనుమతులు ఇచ్చారని, 2022లో నిర్మాణం ప్రారంభించారన్నారు. జులై 23లో వాల్ పూర్తి అయిందని, సాగర్ లో నీళ్లు వచ్చాయి కాబట్టి కూలింది అంటున్నారని, పాలన ఏ విధంగా ఉందో అర్ధం అవుతుందన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం పై నెట్టి వేయాలని బీఆర్‌ఎస్ చూస్తుందని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పుణ్యమే కులడమని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రజల సొమ్ముని వృధా చేశారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాపాలను ఇతరులపై రుద్దాలని చూస్తున్నారని, సుంకిశాల వాల్ కూలడం పై విచారణకు ఆదేశిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..