ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ప్రతిపక్ష అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంటుకు అనర్హుడయ్యారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా కేరళలోని వాయనాడ్‌లోని ఆయన నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ స్థానానికి ప్రత్యేక ఎన్నికలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. రాహుల్ గాంధీ అనర్హత ఇష్యూపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉడత ఊపులకు భయపడే అతను కాదు రాహుల్ అని ఆయన వ్యాఖ్యానించారు. అమిత్ షా సూత్రధారితో రాహుల్ పై సూరత్ లో తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీ తీరును ఖండించిన భట్టి విక్రమార్క.. రాహుల్ గొప్ప ప్రజాస్వామ్య వాది అని కొనియాడారు. మోడీ అసలు స్వరూపం బయట పడిందని, కేసు లకు రాహుల్ గాంధీ భయపడరని ఆయన అన్నారు.
Also Read : Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?
అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. మోడీ, బీజేపీ నియంతల పోకడలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యక్తిగత సమస్య కాదని, ఇది ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాలకు చీకటి రోజులు అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఉద్యమాలు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఉధృతంగా పోరాటం చేస్తుందన్నారు. న్యాయపరంగా, రాజకీయంగా మా పోరాటాలు ఉంటాయని, రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడం తో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వమన్నారు. మా పోరాటాలు, మేము ప్రశ్నించడం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Disqualified MLAs-MPs: రాహుల్ గాంధీ కంటే ముందు సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే..