అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం అయిన భక్తి టీవీ కోటి దీపోత్సవం 8వ రోజుకి చేరింది. ఈ నెల 14వ తేదీ వరకూ ఈ మహా క్రతువు సాగనుంది. ఇవాళ కార్తిక పౌర్ణమి శుభవేళ జంటనగరాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇవాళ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీటం, మైసూరు)వారు అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ పవర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ప్రవచనామృతం వినిపించారు. వేదికపై మహాదేవునికి కోటి బిల్వార్చన గావించారు.

Karthi: తమిళనాట ఓకే.. కార్తీకి తెలుగులో పూర్వవైభవమెప్పుడు?
భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన చేశారు. పంచశైవ క్షేత్రాల కల్యాణాలు నేత్రపర్వంగా సాగాయి. కార్తిక పౌర్ణమి కావడంతో నంది వాహనం, పల్లకీ సేవ నిర్వహించారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీపాల ఉత్సవంలో మీరూ పాల్గొనండి.. ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కండి.దీపాలను వెలిగించి చీకటిని పారద్రోలడం, మనిషి జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా, సుఖశాంతులు కలిగించాలని ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహించడం చాలా విశిష్టమయినది.

పరమ పవిత్రమయిన కార్తిక పౌర్ణమి వేళ శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. శక్తిపీఠం కావడంతో స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం తిలకించడం వల్ల అన్ని అనర్థాలు తొలగిపోతాయి. కల్యాణం రమణీయంగా సాగింది. ఉజ్జయిని భస్మహారతి, నందివాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఓం నమః శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. జ్వాలాతోరణం కడు వైభవంగా నిర్వహించారు. వాహన సేవల్లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. ఇల కైలాసంగా విలసిల్లింది. సోమవారం కావడం, పౌర్ణమి వేళ వేలాదిమంది భక్తులు కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియంలోపల ఖాళీ లేకుండా పోయింది. మంగళవారం చంద్రగ్రహణం అయినా.. కోటి దీపోత్సవం జరగనుంది. రేపు శ్రీకాళహస్తీశ్వరుడు తరలిరానుండడంతో గ్రహదోషాలెవరికీ అంటవు. అంతేకాదు గంగానది నుంచి తెచ్చిన దివ్యజలంతో సంప్రోక్షణ జరుగుతుంది.