పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పర్యటన సిద్దిపేట జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటి పారుదల ప్రాజెక్టులను ఆయన పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించి ప్రాజెక్టును నిశితంగా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ లో నీటి పొదుపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే తెలంగాణలోని నీటి ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. కొత్త టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ వద్ద ఉన్న డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చామని సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. భూగర్భ జలాలను పొదుపు చేసే సాంకేతికత గురించి సమాచారం తెలుసుకుంటామన్నారు.
Also Read : Tips For Best Skin : యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఇలా చేస్తే.. అక్కడ చర్మం మెరిసిపోతుంది..
తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాలను కాపాడేందుకు గ్రామాల్లో చిన్న డ్యామ్‌లు నిర్మించిందని, దీంతో ఇక్కడ భూగర్భ జలాలు 2 మీటర్ల వరకు పెరిగాయన్నారు. అనంతరం మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్య ఉన్న చెక్‌డ్యామ్‌ను పరిశీలిస్తారు. అనంతరం మల్లన్ సాగర్, గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసిన పాండవుల చెరువును కూడా పరిశీలిస్తారు. మర్కుక్ పంపు హౌస్ ని పరిశీలించిన అనంతరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు.. పంజాబ్ లో అన్ని రకాల వనరులు ఉన్నాయని, అక్కడ సాంకేతికతను బాగా సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ నీటి పారుదలలో మోడల్ గా ఉందని, దీనిని పంజాబ్ లో కూడా అమలు చేస్తామని ఆయన అన్నారు.
Also Read : Deepti Sharma: దీప్తి శర్మ అరుదైన రికార్డు.. తొలి భారత స్పిన్నర్‌గా!
దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర సమస్యతో బాధపడుతున్నారని, జంతర్ మంతర్ దగ్గర రైతులు ఆందోళన చేశారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేదన్నారు. కానీ 80 శాతం మంది వ్యవసాయమే చేస్తున్నారని, పంజాబ్ లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతాయని ఆయన వెల్లడించారు. తెలంగాణలో కాలువల ద్వారా పంటలు పడినట్టు.. పంజాబ్ లోను అమలు చేస్తామని, కొండ పోచమ్మ సాగర్ అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు.