నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చ్చిన చిత్రం భగవంత్ కేసరి . 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి బానవో భేటీ కో షేర్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కథ, కథనం, మహిళా శక్తి అంశం ఆడియెన్స్ నుండి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు జాతీయ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు కూడా అందుకుంది.
Also Read : Mega 158 : వరప్రసాద్ గారు.. బాబీ కథ కూడా మారిందా?
కాగా ఇప్పడు ఈ సినిమాను తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా జననాయగన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే మా సినిమా రీమేక్ కాదని వాదిస్తూ వచ్చారు జననాయగన్ దర్శకుడు హెచ్ వినోద్. తీరాట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరి అంచనాలను నిజం చేస్తూ భగంవత్ కేసరి సినిమాను రీమేక్ మాత్రమే కాదు ఏకంగా ఫ్రెమ్ టు ఫ్రెమ్ రీమేక్ చేశాడు హెచ్ వినోద్. మరోవైపు బాలయ్య భగవంత్ కేసరికి విజయ్ జననాయగన్ కు కంపారిజాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్ లో ఉన్న భగవంత్ కేసరి సినిమాను చూసేస్తున్నారు. దాంతో టాప్ 1 లో ట్రేండింగ్ కు వచ్చేసింది భగవంత్ కేసరి. ఏదేమైనా జననాయగన్ ట్రైలర్ చూసాక బాలయ్య మాస్ పర్ఫామెన్స్ ను విజయ్ మ్యాచ్ చేయలేదనే చెప్పాలి.