Throat Pain : చలికాలంలో మనకు తరుచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలం వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా హానికారక బ్యాక్టీరియాలు, వైరస్‌లు మన గొంతులో ఇట్టె తిష్ట వేస్తూ ఉంటాయి. ఫలితంగా గొంతు అంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినటం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : Beauty Tips: ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?
సీజన్ మారినప్పుడల్లా జలుబు, దగ్గుతో పాటు గొంతులో కూడా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. గొంతులో మంట, నొప్పి ఇలాంటి వాటితో పాటు గరగర లాంటి శబ్దాలతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి మింగడం కూడా కష్టమవుతుంది. ఈ గొంతు నొప్పి కి చాలా వరకు వైరస్, బ్యాక్టిరీయాలు కారణమవుతుంటాయి. తొంబై శాతం కేసుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లే గొంతుకి సమస్యలు తెస్తుంటాయి. వైరస్ కారణంగా వచ్చే గొంతు నొప్పి ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాట్లాడినప్పుడు వ్యాధికారక వైరస్ సూక్ష్మక్రిములు ఇతరులకు తేలికగా వ్యాపిస్తాయి. పిల్లల్లో సమస్య కనిపించినప్పుడు, అది ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ఎక్కువగా బయట తిరగని ఇవ్వకూడదు. చేతుల్ని తరచూ అడుగుతూ ఉండాలి. తరచూ ఉపయోగించే వస్తువుల్ని బట్టల్ని శుభ్రం చేస్తూ ఉండాలి.
Also Read : Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు
గొంతులో అసౌకర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి, మంట గరగర శబ్దాలు తగ్గుతాయి. మంచి ఉపశమనం ఉంటుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వ్యాధి కారకాలతో బాగా పోరాడ గలుగుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు గొంతులో తేమను పెంచి మింగడాన్ని తేలిక చేస్తుంది. గొంతు నొప్పితో బాధ పడుతున్నప్పుడు ద్రవ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మెత్తటి గుజ్జు లాంటి ద్రవ ఆహారాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మింగడాన్ని తేలిక చేస్తాయి. తరచూ ఏదైనా చప్పరించాలి. చప్పరించేందుకు ఏవైనా ఇస్తుంటే లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించే సహజసిద్ధమైన పరిష్కారం. గొంతు నొప్పి ఉన్నప్పుడు కారం, మసాలాలు బాగా తగ్గించాలి. ద్రవ ఆహారాలు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.