Beauty Tips: పోషకాహార లోపంతో పాటు కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల కూడా అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటివి ఎక్కువగా నుదిటిపై కనిపిస్తారు. ఇవి చిన్నగా కనిపించినా ముఖంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. నుదురు మొటిమలను తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్ లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇందులో వాడే కొన్ని రసాయనాల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు బ్యూటీషియన్లు సహజ పద్ధతులను ఎంచుకోవాలి. అవి ఏంటో చూద్దాం..
* కొందరి స్త్రీలను ముఖంపై చారికల్లాంటి మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని నివారించడానికి
* ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. -ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుకోకవాలి.
* ఎక్కువగా నీళ్ళు తీసుకొవడం వల్ల ముఖం తాజాగా తయారయ్యి మచ్చలు పోతాయి. – కొంచెం ఉల్లి రసంలో చెంచా తేనె కలిపి రాసుకుంటే ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు నివారించవచ్చు.
* మచ్చలపై నిమ్మతోక్కతో మసాజ్ చేసుకోవాలి. -వారానికి రెండుసార్లు బాదంపప్పును నీటిలో నానబెట్టి నానిన తర్వాత దంచి ఒక చెంచా నిమ్మరసంలో కలపి మెత్తగా పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే గుణం కనపడుతుంది.
* కొంచెం ఉల్లి రసంలో దూదిని ముంచి నల్ల మచ్చలు ఉన్న చోట రాసుకుంటే ఫలితం ఉంటుంది. – అరకప్పు టమొటో రసంలో అరకప్పు మజ్జిగను మిక్స్ చేసి మచ్చలు మీద రాస్తే మచ్చలు పోతాయి.
చర్మం మెరవాలంటే!
* చలికాలంలో మన చర్మానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. చల్లటి గాలులు, వాతావరణం మన చర్మంలోని తేమను పీల్చేస్తాయి. ఫలి తంగా అది నిర్జీవంగా, కాంతివిహీనంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే… ఓ పద్ధతి ప్రకారం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
* ముందుగా ముఖాన్ని తడి వస్త్రంతో తుడవాలి. ఇప్పుడు గాఢత తక్కు వగా ఉండే ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత మెత్తని వస్త్రంతో తుడవాలి. అదయ్యాక….
* మీ ముఖంపై ఉండే చర్మం ఆరోగ్యంగా, నవయౌవనంగా కనిపించా అంటే టోనింగ్ తప్పనిసరి. దూదిపై టోనర్ వేసుకుని ముఖాన్ని శుభ్రం చేసుకో వాలి. ఇది మీ ముఖంపై మిగిలిపోయిన మురికిని తొలగిస్తుంది. అంతేకాదు ముఖంపై ఉన్న రంధ్రాలను కూడా శుభ్రం చేస్తుంది. చర్మం మృదువుగా మారేలా చేస్తుంది.
* పూతః ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకున్న ఏదయినా పూతను ముఖానికి వేసుకుని పదిహేను నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. తరు వాత నాణ్యమైన మాయిశ్చరైజర్ని పట్టించాలి. దీనివల్ల చర్మానికి కావా ల్సిన తేమ అందుతుంది.