Honor Pad X9a Tablet: ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ హానర్ తాజాగా కొత్త ట్యాబ్లెట్ ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. హానర్ ప్యాడ్ X9a (Honor Pad X9a) పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను విడుదల చేశారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ కలిగి ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ హానర్ ప్యాడ్ X9a మోడ్రన్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. దీనిని గ్రే కలర్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసారు. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ట్యాబ్లెట్‌లో 11.5 అంగుళాల 2.5K ఎల్సిడి స్క్రీన్ ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ మరింత స్మూత్‌గా ఉంటుంది.
Read Also: DD vs LSG: వైజాగ్ ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వస్తుందా?
ఈ హానర్ ప్యాడ్ X9a ట్యాబ్లెట్ ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 685 చిప్‌సెట్ పై పని చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీతో అందించనుంది. అలాగే దీనికి మరో 8GB వరకు అదనంగా వర్చువల్ ర్యామ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పై ఈ ట్యాబ్లెట్ పని చేస్తుంది. అయితే, ఈ ట్యాబ్లెట్‌కు ఎన్ని సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందుతాయో కంపెనీ తెలపలేదు.
ఇక ఈ డివైజ్ లో 8300mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఇందుకోసం 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేస్తే ఏకంగా 70 రోజుల వరకు స్టాండ్‌బై మోడ్‌లో ఉండగలదని కంపెనీ ప్రకటించింది. హానర్ ట్యాబ్లెట్‌లో 8MP రియర్ కెమెరా అందుబాటులో ఉంది. అలాగే ఇక సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందించబడింది.
Read Also: Andhra Pradesh: ఉద్యోగులకు తీపికబురు.. ఖాతాల్లో జమ అవుతోన్న నిధులు..
వీటితోపాటు ఇందులో మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం క్వాడ్ స్పీకర్ యూనిట్ ను కూడా అమర్చారు. వైఫై, బ్లూటూత్ 5.1, వైర్‌లెస్ కీబోర్డ్ కూడా ఉన్నాయి. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ట్యాబ్లెట్ ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దీనిని మలేసియాలో మాత్రమే విడుదల చేసారు. భారతదేశంలో ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు విడుదల అవుతుందో హానర్ అధికారికంగా ప్రకటించలేదు. మొత్తంగా, హానర్ ప్యాడ్ X9a ఆకట్టుకునే డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, మంచి బ్యాటరీ బ్యాకప్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో అతి త్వరలో భారత్ లోకి రానుంది.