Bandi Sanjay : రేపు బీజేపీ కార్యాలయంలో ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’పేరుతో మరో దీక్షకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడంతోపాటు గత 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మహిళలకు చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. దీంతోపాటు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మహిళా బిల్లు పేరుతో తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని మరోసారి యావత్ దేశానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మహిళా మోర్చా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి కొల్లి మాధవి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మహిళా మోర్చా నేతల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు.
Also Read : Stray Dogs Attack: వీధి కుక్కల స్వైర విహారం.. కనిపించిన వారినల్లా కరుస్తూ..
Also Read
రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష చేయాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతితోపాటు మహిళా మోర్చా రాష్ట్ర నాయకులంతా ఈ దీక్షలో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
Also Read : Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. జనవరి తర్వాత అతిపెద్ద దాడి ఇదే..
2014 నుండి కేసీఆర్ కుటుంబమే అధికారంలో ఉంది. అంతకుముందు యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కానీ ఏనాడూ మహిళా బిల్లుపై నోరు మెదపలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లుపైగానీ, మహిళా సమస్యలపైగానీ స్పందించలేదు. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డకు తప్ప ఏ ఒక్క మహిళకు కూడా ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. 2019లో ఇద్దరికి మాత్రమే అవకాశమిచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 4గురికి మాత్రమే టిక్కెట్లిచ్చారు.
కేసీఆర్ కుటుంబం ఏనాడూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై స్పందించలేదు. మద్యాన్ని ఏరులై పారించారు. ఊరూరా బెల్టుషాపులను తెరిపించారు. మహిళల తాళిబొట్లు తెగిపోతున్నా ఏనాడూ మాట్లాడలేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు సహా మహిళా ప్రజాప్రతినిధులకు అవమానాలు జరుగుతున్నా, కన్నీళ్ల పర్యంతమైన ఏనాడూ నోరు మెదపలేదు.
దొంగ సారా దందాతో కోట్లు దండుకోవాలనుకున్న కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులివ్వగానే కేసీఆర్ కుటుంబానికి మహిళా బిల్లు గుర్తుకొచ్చింది. దీక్షలు గుర్తుకొచ్చాయి. తెలంగాణ మహిళలు ఏమైనా ఫరవాలేదు…తప్పు చేసిన తన బిడ్డ జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదని గాయిగాయి చేయాలని చూస్తున్నరు. లిక్కర్ కేసు నుండి ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు మహిళా దీక్ష పేరుతో డ్రామాకు తెరదీశారు.
కవితకు నిజంగా మహిళలపట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళలను మోసం చేస్తున్న తన తండ్రి ఇంటిముందు దీక్ష చేయాలి. పార్టీలో, ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం పదవులెందుకు ఇవ్వలేదని నిలదీయాలి. అట్లా కాకుండా తన దొంగ సారా దందాను కప్పిపుచ్చుకునేందుకు మహిళా దీక్ష పేరుతో డ్రామా చేయడాన్ని మీరంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ మహిళలకు చేస్తున్న అన్యాయాలను, మోసాలను ఎండగట్టడమే లక్ష్యంగా చేపట్టిన ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్షకు భారీ ఎత్తున మహిళలు హాజరై విజయవంతం చేయాలి. కవిత మహిళా బిల్లు దీక్ష వెనుక ఉన్న కుట్రలను, మోసాలను యావత్ దేశానికి తెలియజేయండి. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపొద్దు. తెలంగాణ మహిళలకు కవిత క్షమాపణ చెప్పేదాకా ఉద్యమించండి. మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్న కేసీఆర్ కుటుంబం తొలుత బీఆర్ఎస్ పార్టీలో 33 శాతం మందికి సంస్థాగత పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చేదాకా పోరాడండి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!