Stray Dogs Attack: హైదరాబాద్ పరిధిలో కుక్కల దాడులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల అంబర్ పేటలో బాలుడి మృతి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. కంటికి కనిపించిన వారిని కరుస్తూ ఆస్పత్రి పాలు చేస్తున్నాయి వీధి కుక్కలు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా పీర్జాధి గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై వీధి కుక్కల దాడి చేశాయి.
రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో మరోసారి వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల బాలుడి పై దాడి చేశాయి. విచక్షణారహితంగా కరచాయి. దీంతో కుక్కలను తరిమి కొట్టి బాలుడిని కాపాడిన స్థానికులు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
పీర్జాధిగూడ 11వ డివిజన్ బుద్ధనగర్ లో వాకింగ్ కి వెళ్లి వస్తున్న భూపాల్ రెడ్డిపై వీది కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆయన ఫీవర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. గతంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు మార్లు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేసాయి. కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, పాలక వర్గం కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తారని, కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కుక్క కాటు బాధితుడు భూపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. అధికారులు, పాలక వర్గం త్వరగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
Read Also: Uttar Pradesh: ఎద్దు బీభత్సం.. 4 ఏళ్ల చిన్నారికి గాయం
కాగా, అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి ఘటన తర్వాత.. జీహెచ్ఎంసీ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద పెరిగింది. అయితే, వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలని పలు కాలనీ వాసులు కోరుతున్నారు. కుక్కల జనాభా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే, కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు.