తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సలసల రక్తం మారుగుతోందని, నా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారన్నారు. కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ధర్మం కోసం దేనికైనా తెగించి కొట్లాడే కార్యకర్తలే మా బీజేపీ కార్యకర్తలన్నారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కన పెట్టి, తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేశామని, తెలంగాణ కోసం 1400 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే… కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘బీజేపీ ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టింది. 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను కేసీఆర్ సద్దుకున్నా…. కేసీఆర్ కు సవాల్ చేసే.. ఆగిన దగ్గర నుంచే పాదయాత్ర చేసి, సక్సెస్ చేసాం. పాదయాత్రలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో సమస్య చెప్పుకున్నారు ప్రజలు. మూసీ ప్రక్షాళనకు ఏమైంది?. డిండి ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది. వరంగల్ ల్యాండ్ పూలింగ్ పేరుతో కేసీఆర్ భూములు లాక్కుంటుండు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక, ల్యాండ్ పూలింగ్ ను తొలగిస్తాం. ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఇచ్చావ్?. పోడు భూముల సమస్య పరిష్కరించావా?. అభివృద్ధి పై చర్చకు రావాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.