బీఆర్ఎస్ అనవసరంగా సృష్టించిన ప్రచారాలే అధ్యక్ష పదవిలో మార్పులు అంటూ మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్. బీఆర్ఎస్ కి వాళ్ల పార్టీ కన్నా పక్క పార్టీలపైనే దృష్టి ఎక్కువగా ఉంటుందని ఆయన విమర్శలు గుప్పించారు. మీడియాని అధ్యక్ష పదవుల మార్పులపై ప్రచారం చేస్తున్నారన్నారు. మా చీఫ్ నడ్డా నుంచి మాకు ఎలాంటి నిర్ణయాలు రాలేదని, అలాంటివి ఏమైనా ఉంటే మా నాయకత్వమే ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read : NTR fan Shyam Death: శ్యాం మరణం పై అనుమానాలు ఉన్నాయి.. విచారణ జరపమని శ్యాం తండ్రి లేఖ!
ఇటువంటి కుట్రలకు కేరాఫ్ అడ్రస్ గా కేసీఆర్ ఉంటారని, అతని కుమారుడైన కేటీఆర్ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో చూస్తున్నామన్నారు. కేసీఆర్ అధ్యక్ష మార్పులు వంటి కుట్రలతో ఇటువంటి ప్రచారాలతో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఈటలపై హత్యయత్నం చేస్తాను అన్న వ్యక్తి ఇంకా బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారని, ఎందుకు అతని అరెస్టు చేయటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈటల భద్రతపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, గతంలో నాపైన రాజాసింగ్ పైన కూడా ఇటువంటి దాడులే జరిగాయి ఇప్పుడు ఈటలపైన దాడులు చేస్తున్నారు వీటన్నిటి పైన విచారణ జరిపించాలన్నారు.