Bandi Sanjay: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. సంజయ్ ఇవాల ఉదయం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు కొండ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మేడిపల్లి గ్రామంలో తన మొదటి…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎల్లుండి ( ఈనెల 10) నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో…
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా.. ఒక మంచి ఎంపీ బండి సంజయ్…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో... కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు.
కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కరీంనగర్ బీజేపీ అడ్డా అని.. బండి సంజయ్ అడ్డా అంటూ ఆయన అన్నారు.