అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ ఈ రాష్ట్రానికి మెడలు విరిచేసాడు.. దళితులకు అండగా ఉంటాను అని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్ పై మండిపడ్డారు. అక్క, చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో హక్కులు అడుగుతున్నావు.. ఇసుక అమ్ముకొని ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నావని ప్రశ్నించారు. జే బ్రాండ్ పేరుతో అక్క చెల్లెమ్మల తాళిబొట్లు తెంపుతున్నావని వ్యాఖ్యానించారు.
PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అమరావతి రాజధాని గురించి ఉద్యమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఒక దళిత డ్రైవర్ ను.. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు.
Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!
మైనారిటీ, బీసీ కార్పొరేషన్లు ప్రవేశపెడతాం.. ప్రతి పండుగకు నిరుపేదలకు తోపాలు అందించినది తెలుగుదేశం ప్రభుత్వం అని బాలకృష్ణ అన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసింది చంద్రబాబు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రం చేశాడు జగన్ అని మండిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపించాలని కోరారు.