IND vs ENG: మరో 10 వికెట్స్.. టెస్టుల్లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin 10 Wickets Short Of Creating History in Tests: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. నేడు భారత జట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ప్రత్యేకంగా నిలవనుంది.
టెస్టు చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం రవిచంద్రన్ అశ్విన్‌కు ఉంది. టెస్ట్ క్రికెట్‌లో ఎలైట్ రికార్డ్ సాధించడానికి కేవలం 10 వికెట్ల దూరంలో ఉన్నాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 95 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 179 ఇన్నింగ్స్‌లలో 23.7 సగటుతో 490 వికెట్లు తీశాడు. 500 టెస్ట్ వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి 10 వికెట్ల దూరంలో ఉన్నాడు. సొంతగడ్డపై యాష్ అద్భుత ప్రదర్శనను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో జరిగే మొదటి టెస్టులో 500వ టెస్ట్ వికెట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్నాడు. కుంబ్లే 132 టెస్టు మ్యాచ్‌లలో 619 వికెట్లు పడగొట్టాడు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, దృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్.
భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, జాక్ క్రౌలీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!