High Court Sent Notice To Kareena Kapoor Khan For Using Bible In Book: ఒక పిటిషన్‌పై నటి కరీనా కపూర్ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె తన గర్భం గురించి రాసిన పుస్తకం యొక్క శీర్షికలో ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించారు. అలా చేసినందుకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా పోలీసులు నమోదు చేయలేదు. ఇక ఈ పుస్తకం, ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మాన్యువల్ ఫర్ మామ్స్-టు-బీ’, ఆగస్టు 2021లో విడుదలైంది. ఈ విషయంలో ఇప్పుడు నటి న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ పుస్తకం టైటిల్ క్రైస్తవుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని లాయర్ క్రిస్టోఫర్ ఆంథోనీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చౌకగా పాపులారిటీ పొందేందుకు ‘బైబిల్’ అనే పదాన్ని టైటిల్‌లో ఉపయోగించడం అభ్యంతరకరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. `
Kona Venkat: కోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలన్న తన విజ్ఞప్తిని తోసిపుచ్చిన అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంథోనీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తదుపరి విచారణ జూలై 1న జరిగే అవకాశం ఉంది. జబల్‌పూర్ వాసి తొలుత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బైబిల్ వంటి పవిత్ర గ్రంథాన్ని నటి గర్భంతో పోల్చలేమని, పుస్తకం టైటిల్ క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆంథోనీ తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆంథోనీ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించడం క్రైస్తవుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తుందో నిరూపించడంలో విఫలమైనందున అతని పిటిషన్‌ను కోర్టు కూడా తిరస్కరించింది. దీని తర్వాత అతను అదనపు సెషన్స్ కోడ్‌ను సంప్రదించగా అక్కడ అది కూడా ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఇప్పుడు హైకోర్టుకు వెళ్లారు.