SC ST Atrocity Case Filed on Kona Venkat: ప్రముఖ సినీ రచయిత, ఇటీవలే నిర్మాతగా మారిన కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కర్ల పాలెంలో ఈ కేసు నమోదయ్యింది. కోన వెంకట్ బాబాయి రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి మరో సారి బరిలోకి దిగారు. ఇక బాపట్లలో ఒక మండలానికి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు కోన వెంకట్. ఇక తాజాగా అదే మండలానికి చెందిన దళిత నేత కత్తి రాజేష్ వైసీపీకి రాజీనామా చేసి శనివారం తన అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో రాజేష్ తమ వద్ద రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు అంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేష్ ను అదుపులోకి పోలీసులు తీసుకున్నట్టు చెబుతున్నారు.
RR vs CSK: తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సీఎస్కే.. ఆర్ఆర్ స్కోరు ఎంతంటే..?
ఇక ఈ క్రమంలో ఎస్సై ఛాంబర్లో వైసీపీ నాయకులతో కలిసి కోన వెంకట్, ఎస్సై తనపై దాడి చేశారని, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని అక్కసుతో తనపై దాడికి పాల్పడ్డారని రాజేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నరేంద్ర వర్మ, అన్నం సతీష్, గోవర్ధన్ రెడ్డి, టిడిపి కార్యకర్తలతో కలిసి గణపవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నిన్న నెలకొంది. ఇక రాజేష్ ఫిర్యాదుతో కోన వెంకట్ తో పాటు వైసీపీ నేతలు, ఎస్సై జనార్దన్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చర్చనీయాంశం అయింది.