తనను "రావణ్" అని పిలిచినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఎదురుదాడికి దిగారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ ప్రమేయాన్ని గెహ్లాట్ ప్రస్తావిస్తూ, “నేను రావణుడినైతే, నువ్వు రాముడివి అయ్యి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇవ్వు” అని అన్నారు.