Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితేష్ తివారీ ‘రామాయణ: పార్ట్ 1’ ప్రమోషన్లు అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ట్రైలర్ విడుదల కాకముందే ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ఒక భారీ వరల్డ్ ఈవెంట్ రేంజ్లో వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్‌లోని విజువల్స్, భారీ స్టార్ కాస్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇది కేవలం ఒక బాలీవుడ్ చిత్రం మాత్రమే కాదు, భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించే గ్లోబల్ ప్రొడెక్ట్ అనే ఇమేజ్ను మేకర్స్ బలంగా తీసుకెళ్లగలిగారు. అయితే ప్రస్తుతం ‘రామాయణ’ టీమ్‌కు సమస్య హైప్ క్రియేట్ చేయడం కాదు ప్రేక్షకుడి మనసుకి హత్తుకునేలా థియేటర్లో చూపించడమే అసలైన సవాలు.
మరోవైపు రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ ప్రమోషన్ స్ట్రాటజీ కూడా అంతే గ్రాండ్‌గా సాగుతోంది. బెంగళూరులో నిర్వహించిన భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, యష్ మాస్ ఎంట్రీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. గతంలో వచ్చిన టీజర్ల కంటే ఈ ట్రైలర్ సినిమా కథపై ఒక స్పష్టమైన అవగాహనను ఇచ్చింది. యష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే సంకేతాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, పవర్, క్రైమ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చుట్టూ ఈ కథ తిరుగుతుందని ప్రమోషన్స్ స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ రెండు భారీ చిత్రాల ప్రమోషన్ల విధానాన్ని గమనిస్తే ఒకటే కామన్ పాయింట్ కనిపిస్తుంది ముందుగా భారీ ఈవెంట్లతో గ్లోబల్ లెవెల్ హైప్ తెప్పించడం, ఆపై ట్రైలర్‌తో అంచనాలు పెంచడం, చివరికి థియేటర్ వద్ద అసలైన పరీక్షను ఎదుర్కోవడం. గ్రాండ్ ఈవెంట్లు, స్టార్ ఎంట్రీలతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్, పాజిటివ్ డిస్కషన్స్ రావచ్చు. కానీ బాక్సాఫీస్ వద్ద రోజు ముగిసేసరికి ఈవెంట్లకు కలెక్షన్లు రావు, కేవలం కంటెంట్‌కు మాత్రమే విజయం దక్కుతుంది. అందుకే ఇప్పుడు ‘రామాయణ’, ‘టాక్సిక్’ టీమ్‌ల ముందున్న అసలు ప్రశ్నహైప్ పెంచామా అని కాదు, ఆ హైప్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలమా? అన్నదే.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!