Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tabu AI Deepfake Case: ఆన్లైన్లో ఏఐ రూపొందించిన అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలతో తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని బాలీవుడ్ నటి టబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు, ఫొటోలు మాత్రమే కాకుండా తన గొంతు కూడా ఉపయోగించి కొందరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
టబు అసలు పేరు తబస్సుమ్ జమాల్ హష్మీ. ఆమె తన పిటిషన్లో పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫొటోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ కార్యక్రమాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను అనుమతి లేకుండా తీసుకుని, వాటిని ఎడిట్ చేసి అభ్యంతరకరమైన కంటెంట్‌గా మార్చుతున్నారని తెలిపారు. కొన్ని వీడియోల్లో శరీర భాగాలను హైలైట్ చేసేలా జూమ్ చేయడం, స్లో చేయడం వంటి మార్పులు చేసి ఆన్లైన్ పెడుతున్నారని ఆరోపించారు. ఏఐ ద్వారా సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు, GIFలు కూడా తన పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆమె కోర్టుకు వివరించారు.
Also Read
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా. దానిని టబు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. అయితే ఆ ఖాతాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన తరఫున బుకింగ్‌లు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో టబు గుర్తింపును ఉపయోగించి ఆర్థికంగా లాభపడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే అంశం కోర్టు దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా టబు ఫొటోలతో మగ్గులు, పోస్టర్లు, క్యాలెండర్లు, హూడీలు, స్వెట్‌షర్టులు వంటి వస్తువులను అనధికారికంగా విక్రయిస్తున్నారని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె పేరుతో తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది.
ఈ కేసులో 150కి పైగా అనుమానాస్పద URLలను కూడా కోర్టు పరిశీలించింది. గూగుల్, మెటా, ఎక్స్, రెడ్డిట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఆదేశాలు అందుకున్న 36 గంటల్లోగా గుర్తించిన లింకులను తొలగించాలి కోర్టు ఆదేశించింది. అలాగే సంబంధిత ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు అవసరమైన సబ్‌స్క్రైబర్ సమాచారం, IP లాగ్ వివరాలను డొమైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మధ్య ఇలాంటి ఏఐ రూపొందించిన అశ్లీల కంటెంట్ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతోంది. అసలు వీడియోలను పోలీనట్లు ఉంటున్న వీటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా వీటిమీద కోర్టులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే టబు ప్రస్తుతం సౌత్, నార్త్ చిత్ర పరిశ్రమలలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో ఆమె పవర్ఫుల్ ఐటీ డిప్యూటీ కమిషనర్‌గా నటిస్తుండగా, నాగార్జున కింగ్100లో సుదీర్ఘ విరామం తర్వాత నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో మెరవనున్నారు. వీటితో పాటు అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ 2026 అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
- Tags
- Actress Tabu
- cinema
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!