Infinix NOTE 50s 5G+: సరికొత్త “ఎనర్జైజింగ్ సెంట్-టెక్” ఫీచర్ తో రాబోతున్న ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్
- సరికొత్త ఫీచర్ తో రాబోతున్న ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్
- “ఎనర్జైజింగ్ సెంట్-టెక్” ఫీచర్ తో రాబోతున్న Infinix NOTE 50s 5G+.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix NOTE 50s 5G+: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇటీవల భారతదేశంలో తన NOTE 50x 5G+ మోడల్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్ కు భారీ రెస్పాన్స్ రావడంతో కంపెనీ ఇప్పుడు మరో కొత్త మోడల్ NOTE 50s 5G+ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా “ఎనర్జైజింగ్ సెంట్-టెక్” అనే విభిన్నమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. NOTE 50s 5G+ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో ఎన్క్యాప్సూలాషన్ టెక్నాలజీని ఉపయోగించి, దాని వెనుక భాగంలో ఉండే వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ద్వారా సువాసన విడుదల ఆయేలా టెక్నాలజీని పొందుపరిచారు. ఈ సువాసన కొన్ని రోజుల పాటు మొబైల్ కొన్న చాలా రోజుల వరకు నిలిచి ఉంటుందని, సువాసన మెల్లిగా విడుదల అవుతూ వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది.
Read Also: Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ఈ ఫీచర్ Marine Drift Blue అనే ప్రత్యేక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సువాసనకు ప్రత్యేకమైన పరిమళ మిశ్రమం కలిగి ఉంది. మెరైన్ అండ్ లెమన్, లిల్లీ ఆఫ్ ది వ్యాలీ (Lily of the Valley), అంబర్ అండ్ వెటివర్ (Amber and Vetiver) అనే 3 సువాసనలను వెదచల్లనుంది. ఇన్ఫినిక్స్ ప్రకారం, ఈ ఫీచర్ వినియోగదారుల వాడకపు అలవాట్లు.. ఇంకా పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి సువాసన తీవ్రత, దీర్ఘాయువు మారుతూ ఉంటుంది. ఇది కేవలం విజువల్, టాక్టైల్ (దృశ్య, స్పర్శ) అనుభూతులతో కాకుండా.. ఓల్ఫాక్టరీ (వాసన ద్వారా) అనుభూతిని కూడా కలిపి వినియోగదారుల అనుభవాన్ని మరింత విభిన్నంగా మార్చేందుకు ఉద్దేశించబడింది.
NOTE 50s 5G+ ఫోన్‌లో 64MP సోనీ IMX682 సెన్సార్ ఉన్నట్లు లీకైన చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 18న భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, టైటానియం గ్రే, రూబీ రెడ్ రంగులలో లభించనుంది. ఇందులో అయితే Marine Drift Blue వేరియంట్ మాత్రమే Scent-Tech ఫీచర్ కలిగి ఉంటుంది. మిగిలిన రెండూ మెటాలిక్ ఫినిష్‌తో అందుబాటులో ఉంటాయి. ఇన్ఫినిక్స్ ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారుల అనుభూతిని విభిన్నంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సువాసన విడుదల చేసే టెక్నాలజీ కొత్తదే. ఈ ఫోన్ ఎంతవరకు ప్రజాదరణ పొందుతుందో చూడాలి. ఏప్రిల్ 18న లాంచ్ అయిన తర్వాత దీని ధర, ఇతర ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!