కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. రాహుల్ గాంధీ ప్రధాని అవడం తథ్యం అన్నారు. రాయపూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు, దేశంలో మార్పుకు నాంది కానున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” యాత్ర అనుభవాలు, ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధినేతగా సోనియా గాంధీ కొనసాగడం, సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ఈ ప్లీనరీ సమావేశాల సందర్భంలో స్మరించుకోవాల్సిన చారిత్రాత్మక అంశాలు అన్నారు గిడుగు రుద్రరాజు.
ఈ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపి నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు వచ్చారన్నారు. దేశ రాజకీయాల్లో ఇదో చారిత్రాత్మక ఘట్టం అన్నారాయన. రాజకీయ, ఆర్ధిక, విదేశాంగ విధానం, యువత, నిరుద్యోగం, సామాజిక న్యాయం, సాధికారత, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారాల కోసం కాంగ్రెస్ పార్టీ విధానాలను ఈ వేదిక ద్వారా దేశ ప్రజలకు స్పష్టం చేస్తాం అని ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పారు.
Read Also: S JaiShankar: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంపై జైశంకర్ ఏమన్నారంటే..?
ఇదిలా ఉంటే నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రాయ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ 85 వ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ “స్టీరింగ్ కమిటీ” సమావేశం ఉంటుంది. ఏఐసిసి సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆరు తీర్మానాలను ఖరారు చేయనుంది స్టీరింగ్ కమిటీ. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేయనుంది సబ్జెక్ట్ కమిటీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” (సిడబ్ల్యుసి) కి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది స్టీరింగ్ కమిటీ.
Read Also: Holi Festival2023: హోలీ జరుపుకోని ప్రదేశాలు ఉన్నాయి.. అవి ఎక్కడున్నాయంటే ?